రాయల్ కేర్ డయాలిసిస్ సెంటర్‌తో నెఫ్రోప్లస్ బిజినెస్ డీల్

256
nephro plus
- Advertisement -

హైదరాబాద్, 10 అక్టోబర్ 2020: భారతదేశ అతిపెద్ద డయాలిసిస్ నెట్ వర్క్ మరియు డయాలిసిస్ ను పునర్ నిర్వచించడంలో మార్గదర్శి అయిన నెఫ్రో ప్లస్ విదేశాల్లో తన మొదటి ప్రముఖ స్వాధీనాన్ని ప్రకటించింది. ఫిలిప్పీన్స్ లో అధిక నాణ్యతాయుత సంరక్షణ పై ప్రధానంగా దృష్టి పెట్టిన ప్రముఖ డయాలిసిస్ నెట్ వర్క్ అయిన రాయల్ కేర్ డయాలిసిస్ సెంటర్స్ ఇన్ కార్పొరేషన్ (ఆర్సీడీసీ) లో మెజారిటీ వాటాను నెఫ్రో ప్లస్ పొందింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా, విదేశాలకు విస్తరించిన మొట్టమొదటి భారతీయ డయా లిసిస్ నెట్ వర్క్ నెఫ్రో ప్లస్ అయింది. బహుళజాతి సంస్థ (ఎంఎన్ సి)గా కంపెనీ పరివర్తన చెందడానికి ఇది నాంది పలికింది.

ఆర్సీడీసీ నెట్ వర్క్ ఫిలిప్పీన్స్ లో బాగా చెందుతున్న నెట్ వర్క్. ప్రస్తుతం మెట్రో మనీలా మరియు సమీ పం లోని ఇతర ప్రావిన్స్ లలో ఉన్న తన ఆరు డయాలిసిస్ కేంద్రాల్లో ఇది 400 మంది డయాలిసిస్ పేషెం ట్లకు చికిత్సను అందిస్తోంది. ఈ డీల్ ద్వారా నెఫ్రో ప్లస్ ఈ నెట్ వర్క్ యొక్క ప్రస్తుత కార్యకలాపాలకు బా ధ్యత వహించనుంది మరియు ఫిలిప్పీన్స్ లో డయాలిసిస్ సంరక్షణ ను మెరుగుపరిచే లక్ష్యంతో తన భార త్ ఆధారిత ప్రొటొకాల్స్ ను,సాంకేతికతలను మరియు కార్యకలాపాల దక్షతను ఆర్సీడీసీ కి అందించనుం ది. కంపెనీ యొక్క విదేశీ విస్తరణ వ్యూహంలో భాగంగా నెఫ్రో ప్లస్ ఈ సేవలను ఇతర ప్రావిన్స్ లకూ విస్త రించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది మరియు రాబోయే 5 ఏళ్లలో ఈ నెట్ వర్క్ ను 50 డయాలిసిస్ కేంద్రాల కు విస్తరించి 2025 నాటికి దీన్ని ఫిలిప్పీన్స్ లో ముఖ్యమైన డయాలిసిస్ నెట్ వర్క్ గా మార్చనుంది.

ఈ విదేశీ స్వాధీనం పై నెఫ్రో ప్లస్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ విక్రమ్ ఉప్పాల మాట్లాడుతూ, “ మా నెట్ వర్క్ కు ఆర్సీడీసీ జట్టును జోడించుకోవడం మాకెంతో ఆనందదాయకం. ఆర్సీడీసీ నాయకత్వ జట్టుతో కలసి పని చేయడం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ఫిలిప్పీన్స్ లో దీన్ని అతిపెద్ద డయాలిసిస్ నెట్ వర్క్ గా చేయడా న్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసేలా ఫిలిప్పీన్స్ లోని వివిధ డయా లిసిస్ కేంద్రాలతో మేం ఇప్పటికే చర్చలు ప్రారంభించాం. ఫిలిప్పీన్స్ లోకి ప్రవేశించడంతో మేము ఆసియా, మధ్యఆసియా మరియు సీఐఎస్ ప్రాంతాల్లో ప్రబల బహుళజాతీయ సంస్థగా మా సంస్థను నిర్మించేందుకు మాకు గల కట్టుబాటును పునరుద్ఘాటిస్తున్నాం” అని అన్నారు.

ఈ భాగస్వామ్యం పై నెఫ్రో ప్లస్ సహ వ్యవస్థాపకులు, పేషెంట్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ కమల్ షా మాట్లాడుతూ, “ వివిధ దేశాల్లో అందుబాటు ధరల్లో సాధ్యమైనంత అత్యుత్తమ సంరక్షణను అందించాలని మేము కోరు కుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో ఈ భాగస్వామ్యం నెఫ్రోప్లస్ కు ఓ పెద్ద ముందడుగు. ఫిలిప్పీన్స్ లో రోగి కేంద్రిత సంరక్షణ ను ఆధారంగా చేసుకొని అత్యుత్తమ విధానాలను అందించడం మాకెం తో ఆనందదాయకం. అదే విధంగా ఆర్సీడీసీ కి చెందిన అత్యుత్తమ విధానాలను భారతదేశంలో కూడా ప్రవేశపెడుతాం. ఈ బహుళ జాతి కార్యకలాపాల నైపుణ్యం భారతదేశంలో నెఫ్రాలజిస్ట్ మరియు హాస్పిటల్ భాగస్వాముల్లో నెఫ్రోప్లస్ బ్రాండ్ ఈక్విటీని గణనీయంగా పటిష్ఠం చేస్తుంది” అని అన్నారు.

రాయల్ కేర్ డయాలిసిస్ నెట్ వర్క్ వ్యవస్థాపకులు శ్రీ సునీల్ చెల్లాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ ఫిలిప్పీన్స్ లో మా వృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు గాను భారతదేశ అతిపెద్ద డయాలిసిస్ నెట్ వర్క్ అయిన నెఫ్రో ప్లస్ తో భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం. డయాలిసిస్ కేంద్రాల నిర్వహణకు సంబంధించి దశాబ్దికిపైగా అనుభవాన్ని వారు తీసుకువస్తున్నారు. భారతీయ డయాలిసిస్ ఎకో సిస్టమ్ లో మొదటిసారిగా ఎన్నో ఎస్ఓపీలు మరియు వినూత్నతలను అది ప్రవేశపెట్టింది. ఫిలిప్పీన్స్ లోని రోగులకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు పరిశ్రమ అగ్రగామి రోగి కేంద్రిత తాత్వికతతో జోడించబడిన నెఫ్రో ప్లస్ యొక్క అంతర్జాతీయ స్థాయి క్లినికల్ సంరక్షణను అందించడాన్ని మేం లక్ష్యంగా చేసుకున్నాం. ఈ భాగ స్వామ్యం తో రాబోయే 4 -5 ఏళ్లలో ఫిలిప్పీన్స్ లో మేం ప్రబల డయాలిసిస్ నెట్ వర్క్ గా ఎదుగుతామని ఆశిస్తున్నాం” అని అన్నారు.

- Advertisement -