బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 26 హైలైట్స్

239
kumar sai
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 26 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. కిల్లర్ కాయిన్స్ రెండు,మూడు దశలు,సొహైల్-రాజశేఖర్ మాస్టర్ మధ్య మళ్లీ రచ్చ,మెహబూబ్ అతి తెలివితో భంగపాటు,కెప్టెన్‌గా కుమార్ సాయి ఎన్నికవడం ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.

రెండో దశలో నోయల్, అరియానా, దివి, అమ్మా రాజ శేఖర్‌లు ముందే ఔట్ కాగా సుజాతను టార్గెట్ చేయాలని అరియానా సూచించిండంతో మెహబూబ్ ఆమెను ఔట్ చేశాడు. దీంతో సుజాత- అరియానా మధ్య మాటల యుద్దం జరిగింది.

ఇక మూడో లెవల్‌లో భాగంగా ఎండ్ బజర్ మోగగానే ఇంటి సభ్యులందరూ ఏదైనా చేసుకుని కాయిన్స్ విలువ పెంచుకోవచ్చని ఇంటి సభ్యుల మధ్య ఫిటింగ్ పెట్టారు. లాస్య తన దగ్గర ఉన్న ఫిఫ్టీ పర్శంట్ కాయిన్స్‌ని రాజశేఖర్ మాస్టర్‌కి ఇవ్వగా అరియానా, నోయల్, దివి, అవినాష్‌ కూడా రాజశేఖర్ మాస్టర్‌కి కాయిన్స్ ఇచ్చేశారు.

సొహైల్, అఖిల్, మోనాల్‌లు తమ మద్ద ఉన్న కాయిన్స్‌ని మెహబూబ్‌కి ఇచ్చేశాడు. చివరగా ఎండ్ బజర్ మొగడం ఎవరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చెప్పాలని బిగ్ బాస్ కోరారు. అయితే మొహబూబ్ దగ్గర 10800 కాయిన్స్‌ ఉన్నా సుజాత దగ్గర ఉన్న స్విఛ్ కాయిన్‌తో కెప్టెన్ రేసులో నిలవలేకపోయాడు. దీంతో కాయిన్స్ ఎక్కువగా ఉన్న సుజాత,అమ్మరాజశేఖర్,హారిక,కుమార్ సాయిలను కెప్టెన్ రేసులో ఉంచారు బిగ్ బాస్. ఈ క్రమంలో మరోసారి సొహైల్- రాజశేఖర్ మాస్టర్ మధ్య గొడవ జరిగింది. నా లైఫ్‌లో నీతోమాట్లాడనని సొహైల్ మొహం మీద చెప్పేశాడు మాస్టర్‌.

తర్వాత అర్థరాత్రి 12 గంటలు అని బిగ్ బాస్‌ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చినా అఖిల్, మొనాల్‌లు రొమాన్స్‌కి తెరతీశారు. తర్వాత కెప్టెన్‌ ఎంపికదారుల మధ్య మట్టిలో కాయిన్స్ ఇచ్చి వాటిని వెతికి పట్టి బుట్టలో వేయాలని ఎవరి బుట్టలో ఎక్కువ కాయిన్స్ పడితే వాళ్లే విన్నర్ అని బిగ్ బాస్ ప్రకటించగా కాయిన్ కోసం మట్టిలో కొట్టుకున్నారు. హారికకు 2000 కాయిన్స్.. అమ్మా 2300, సుజాత 2900, కుమార్‌కి 3500 కాయిన్స్ రావడంతో ఈవారం కెప్టెన్‌గా కుమార్ సాయి నిలిచాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నారు కుమార్ సాయి.

- Advertisement -