పంజాబ్ పై ముంబై ఘనవిజయం…

113
mi

ఐపీఎల్‌ 13లో భాగంగా ముంబై రెండో విజయాన్ని నమోదుచేసింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 143 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్,బౌలింగ్ అన్నిరంగాల్లో రాణించిన ముంబై …పంజాబ్‌పై సమిష్టి విజయాన్ని నమోదుచేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. మయాంక్ అగర్వాల్,లోకేశ్ రాహుల్ ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.అయితే ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన బుమ్రా చక్కని బంతితో అగర్వాల్‌ను క్లీన్ బోల్డ్ చేశాడు. అగర్వాల్ 25 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా తర్వాత వచ్చిన కరుణ్ నాయర్…కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు.

లోకేశ్‌ రాహుల్(17),మ్యాక్స్‌వెల్ 11 పరుగులు చేసి ఔట్ కాగా నికోలస్ పురాన్‌ 44 పరుగులు చేసి కాసేపు అలరించిన పాటిన్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జిమ్మి నిశామ్ (7),సర్పరాజ్(7) పరుగులు చేసి వెనుదిరిగారు. బుమ్రా,చాహర్‌,పాటిన్సన్ తలో రెండు వికెట్లు తీయగా బోల్ట్‌,కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశారు.

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లో 4 వికెట్లు కొల్పోయి 191 పరుగులు చేసింది. డికాక్ 0,సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇన్నింగ్స్ గాడిలో పెట్టే పనిని భుజాన వేసుకున్న రోహిత్, ఇషాన్ కిషన్‌ ఆరంభంలో మెల్లగాఆడిన తర్వాత స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

ముఖ్యంగా రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు,3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఐపీఎల్‌ చరిత్రలో 5 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఇక చివరి ఓవర్లలో పోలార్డ్, పాండ్యా విశ్వరూపం చూపించారు. ఒకరికొకరు పోటి పడి పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశారు.పాండ్యా 11 బంతుల్లో 2 సిక్స్‌లు,3 ఫోర్లతో 30 పరుగులు చేయగా పొలార్డ్ 20 బంతుల్లో 4 సిక్స్‌లు,3 ఫోర్లతో 47 పరుగులు చేశారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 191 పరుగులు చేసింది.