యూఏఈలో అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్‌!

266
uae vaccine
- Advertisement -

కరోనా వ్యాక్సిన్ కోసం పలు దేశాల్లో ముమ్మరంగా ట్రయల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యాలో మూడోదశ ప్రయోగాలు కొనసాగుతుండగానే మరో దేశం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మూడో దశ ప్రయోగాలు కొనసాగుతుండగానే టీకాను యూఏఈ అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న యోధులకు టీకా అందజేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్ వ్యాక్సిన్ తొలి డోస్‌ను తీసున్నారు.

టీకా తీసుకున్న తర్వాత తనకు ఎటువంటి దుష్ప్రభావాలు సంభవించలేదని, ఈ కారణంగానే తాను డోస్ తీసుకున్నానని ఆయన వెల్లడించారు.

- Advertisement -