పెళ్లి పీటలెక్కనున్న హీరో తరుణ్!

190
hero

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ హీరో తరుణ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ప్రస్తుతం తనకు కాబోయే భార్య కుటుంబ సభ్యులతో మాటా మంతీ జరుపుతుండగా త్వరలోనే తరుణ్ పెళ్లి కబురు అధికారికంగా ప్రకటించనున్నారు. తరుణ్ సినిమాలు మానేసి చాలా కాలం కాగా ఇటీవల తీసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బోళ్తాకొట్టాయి.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరోలంతా పెళ్లిబాటపట్టారు. దగ్గుబాటి రానా,నితిన్,నిఖిల్ ఇప్పటికే పెళ్లిచేసుకోగా మెగా బ్రదర్ నాగబాబు కూతరు నిహారిక ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. తాజాగా లవర్ బాయ్ తరుణ్ కూడా పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది.