ఆన్​లైన్​ ఆడిట్​లో తెలంగాణ అద్భుత ప్రతిభ..

314
telangana

ఆన్​లైన్​ ఆడిట్​లో తెలంగాణ అద్భుత ప్రతిభ చాటింది. ‘తెలంగాణ స్టేట్​ ఎక్సలెంట్​ పర్ఫామెన్స్​’ అని కేంద్రం ప్రశంసించింది. తెలంగాణ ఆడిట్​ శాఖ నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీల్లో ఆన్​ లైన్​ ఆడిట్​ ప్రక్రియ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కేంద్ర పంచాయితీరాజ్​ శాఖ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయితీల ఆన్​ లైన్​ ఆడిట్​ కార్యక్రమం మరో పది రోజుల్లో(సెప్టెంబర్​ 30) ముగియనున్నది. గత కొన్ని రోజులుగా ఆడిట్​ శాఖ అధికారులు 3,217 గ్రామ పంచాయితీల్లో 339 మంది ఆడిటర్లు ఇప్పటి వరకు 20,119 అభ్యంతరాల(ఆబ్జెక్షన్స్​)తో ఆడిట్​ రిపోర్టులను ఆన్​ లైన్‌లో పొందుపరిచారు.

గ్రామ పంచాయితీల ఆడిట్​ అంశంపై ఆడిట్​ శాఖ డైరెక్టర్​ మార్తినేని వెంకటేశ్వర్​ రావు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగడం, నిరంతరం మైక్రో సాఫ్ట్​ యాప్​ ద్వారా వీడియో క్లాసులు నిర్వహించి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ పర్యవేక్షించడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఆన్​ లైన్​ ఆడిట్​లో దేశం గర్వించే విధంగా ముందంజలో నిలిచింది. పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​(పిపిటి)ని ఇతర రాష్ట్రాలకు కేంద్ర పంచాయితీరాజ్​ శాఖ కార్యదర్శి సునిల్​ కుమార్ సిఫార్సు చేశారు.​