- Advertisement -
లాభదాయక పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన నిరంజన్ రెడ్డి…అన్నదాత ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు.
రాష్ట్రంలో దసరా నాటికి రైతువేదికలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దేశంలో మొదటిసారిగా ప్రతి రైతు పంటను రికార్డు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కోటి 31 లక్షల 50 వేల ఎకరాల్లో పంట సాగవుతున్నదని చెప్పారు. పప్పుధాన్యాల పంటలను మరింతగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సోనాతో పంట రాబడి ఎక్కువగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగవుతున్నదని చెప్పారు.
- Advertisement -