ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం కావాలి..:వివేకానంద్

108
kp vivekananda

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడోవిడతలో భాగంగా మంత్రి మల్లారెడ్డి తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారికి ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి రంగారెడ్డి నగర్ లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సి.ఎచ్.మహేందర్ రెడ్డి గారు, Dr. సి.ఎచ్. భద్రా రెడ్డి గారు మరియు Dr. సి.ఎచ్. ప్రీతీ రెడ్డి గారికి ఈ ఛాలంజ్ విసిరారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎంపి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‘ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న ‘హరిత హారం‘ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తుందని,ఈ ఛాలెంజ్ లో చాలా మంది ప్రముఖులు, ప్రజలు మొగ్గుచూపుతున్నారని అన్నారు.

దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమంకు అపూర్వ స్పందన లభిస్తోందని, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఎంపి సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గారు, స్థానిక కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్ గారు మరియు జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.