కరోనా బాధితులను పరామర్శించిన మంత్రులు ఈటల,ఎర్రబెల్లి

248
errabelli
- Advertisement -

మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ లోని కోవిడ్ ఐసోలాషన్ కేంద్రాన్ని పరిశీలించి కరోన రోగులతో మాట్లాడారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్యే శంకర్ నాయక్.జెడ్పి ఛైర్మెన్ బిందు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల రాజేందర్….మహాబూబాబాద్ జిల్లా హాస్పిటల్ లో ఉన్న కేసులు అంత సీరియస్ గా లేవు….మహాబూబాబాద్ జిల్లా ఆసుపత్రి లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఎవ్వరికీ ఏమైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి,ప్రజలు సాధ్యమైనంత వరకు గుంపులుగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ లో ఉన్న అన్ని రకాల సేవలు ప్రభుత్వ దవాఖానల్లో ఉన్నాయని చెప్పారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కోవిడ్ రోగుల విషయంలో ఎన్నో రకాలుగా సేవలు చేస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కోవిడ్ రోగులను అంటరాని వారిగా చూడవద్దు.అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాలుగా సేవలు అందించడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

- Advertisement -