కరోనా అంటే భయపడే రోగం కాదు: హరీష్ రావు

200
harishrao

సిద్ధిపేట జిల్లా నారాయణరావు పేట మండలం మల్యాల గ్రామంలో సోమవారం ఉదయం ఘన వ్యర్థాల నిర్వహణ రిసోర్స్ పార్కు- కంపోస్టు తయారీ కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి ప్రారంచారు మంత్రి హరీష్ రావు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీష్ రావు గ్రామ స్ధాయిలోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మల్యాల గ్రామ ప్రజా ఆరోగ్య శ్రేయస్సు కోసమే హెల్త్ కిట్ అన్నారు.

ఈ మేరకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రూ.40 వేలు నిధులు సమీకరించగా, అదనంగా స్వయంగా మరో రూ.60వేలు రూపాయలు జోడించి కరోనా నేపథ్యంలో గ్రామ ప్రజా ఆరోగ్య శ్రేయస్సు కోసం మెడికల్ హెల్త్ కిట్ అందజేశౄమన్నారు.

కరోనా అంటే భయపడే రోగం కాదు. కరోనా గురించి గ్రామ ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు సూచన. పీహెచ్ సీ పరిధిలో ప్రతి రోజూ 50 కరోనా పరీక్షలు జరపాలి, గ్రామంలో గ్రామ ప్రజలంతా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకునేలా.. అవగాహన కల్పించాలన్నారు.

స్వచ్ఛ గ్రామంగా మార్చి జాతీయ అవార్డు తేవాలి…గ్రామ ప్రజలందరీ ఆరోగ్యాలు బాగుండాలంటే.. గ్రామాన్ని పరిశుభ్రంగా చేద్దాం. గ్రామ ప్రజలంతా ఐక్యతతో కట్టుబడి స్వచ్ఛ మల్యాల గ్రామంగా మార్చుకుని జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకుందామని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేరుగా చేసి ఇచ్చి చెత్తపై కొత్త సమరంలా.. సాగ్రిగేషన్ షెడ్ లో వర్మీ కంపోస్టు తయారు చేయాలని గ్రామాన్ని పరిశుభ్ర, స్వచ్ఛ ఆరోగ్యంగా మార్చాలని ప్రజలకు హితవు పలికారు.