ట్రై క్రాఫ్ట్ మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరించిన కేటిఆర్

270
ktr
- Advertisement -

సృజనాత్మకత ఉట్టిపట్టే కళాకృతులను తయారు చేసే హస్తకళను నమ్ముకొని చాలా మంది కళాకారులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతీ వస్తువు తయారికి యంత్రాల వాడకం ఎక్కువైన ప్రస్తుత పారిశ్రామిక పరిస్తితులలో హస్తకళలు, కళాకారులు మరుగున పడే అవకాశం పోలేదు.

ఈ నేపథ్యంలో జగిత్యాలకు చెందిన రమా శ్రీనివాస్ గారు, హస్త కళాకారులను ప్రోత్సహించడానికి, వారి హస్త కళాకృతులను దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేయడానికి ట్రై క్రాఫ్ట్ మొబైల్ అప్లికేషన్ ను తయారు చేశారు.మట్టి పాత్రలు, కళాఖండాలు తయారుచేసే కుటుంబ నేపధ్యం ఉన్న రమా శ్రీనివాస్ గారు ఎంబీఏ పూర్తయ్యేసరికి గారు ఈ కళను నమ్ముకున్న వారి కలలను నిజం చేయడానికి నిశ్చయించుకున్నారు.

ఏ సందర్భంగా మాట్లాడుతూ “హస్త కళాకృతులు నేరుగా తయారీదారు నుండి హస్తకళా పోషకుల వరకు చేరడానికి ఒక వేదికగా ఈ మా క్రాఫ్ట్ మొబైల్ అప్లికేషన్ ఎంతో దోహదపడుతుంది. నేను నా చిన్నతనంనుండి ఈ రంగంలో ఏదైనా మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాను. నా ప్రయత్నం ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా అప్లికేషన్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ” అని రమా శ్రీనివాస్ గారు అన్నారు.

ఇంధనం డబ్బు, సమయం వృధాను అరికడుతూ , సరుకు రవాణా రంగాన్ని ఒక ప్రణాళిక బద్దంగా, ప్రతి వాహనం up and down లో పుర్తి సామర్ధ్యంతో నడుస్తూ, సరుకు రవాణాను చౌకగా అందుబాటులోకి తీసుకురావడానికి సర్వేజనా ఐటీ సొల్యూషన్స్ వారి AADHATRIP- Transport Communications on Mobile Application ను మంత్రి శ్రీ కేటీఆర్ నేడు ఆవిష్కరించారు.

- Advertisement -