యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2020 ప్రారంభంకానుండగా నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ ప్రారంభానికి నెల రోజుల ముందుగానే ఆటగాళ్లు యూఏఈ చేరుకోనుండగా కరోనా నిబంధనల ప్రకారం టోర్నమెంట్ జరగనుంది.
ఐపీఎల్ 2020 సీజన్‌కి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి లభించినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. విదేశాల్లో టోర్నీలు నిర్వహించాలంటే హోమ్, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి తప్పనిసరి.ఇక అనుమతి లభించడంతో ఐపీఎల్‌కు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఇక ఇప్పటికే ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ల కోసం బిడ్‌లను ఇప్పటికే బీసీసీఐ ఆహ్వానించగా రేసులో అమెజాన్, పతాంజలి, జియో, బైజ్యూస్ తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ నెల 18న కొత్త స్ఫాన్సర్ ఎవరనేది తేలనుంది. యూఏఈలోని షార్జా, అబుదాబి, దుబాయ్ వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.