ఎమ్మెల్యే పెద్ది…పెద్దమనసు సొంతఖర్చులతో ఐసోలేషన్‌ సెంటర్‌

339
peddi sudarshan reddy
- Advertisement -

టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా చాలామంది కరోనా బారీన పడుతుండటం వారికి హోం ఐసోలేషన్‌ని సజేషన్ చేస్తున్నారు డాక్టర్లు.

ఈ నేపథ్యంలో తన సొంత ఖర్చులతో నర్సంపేటలో ఐసోలేషన్‌ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. ద్వారకపేట రోడ్డులోని ఎస్ఎంఎస్ బాలికల హాస్టల్‌లో 200 పడకలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని వరంగల్ రూరల్ కలెక్టర్ హరితతో కలిసి ఆయన గురవారం ప్రారంభించారు.

ఇళ్లలో ఉండటం ఇబ్బందిగా ఉన్న కరోనా పాజిటివ్ పేషంట్లు ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ కేంద్రంలో కరోనా బాధితులకు పౌష్టికాహారంతోపాటు కషాయం అందజేస్తారు. అలాగే ఇతర వసతులను కల్పించనున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా వచ్చిన వారు మాత్రమే ఈ ఐసోలేషన్‌ సెంటర్‌లో చికిత్సకు అనుమతించనున్నారు.

- Advertisement -