కేంద్రమంత్రి హర్షవర్దన్‌కి మంత్రి కేటీఆర్ లేఖ..

243
ktr
- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలు పైన సవివరంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ కి ఒక లేఖ రాశారు.ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచానికి వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉన్నదని సుమారు ఇక్కడి నుంచి 5 బిలియన్ డోసులు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ తయారవుతుందని ఇది మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో ఒకటిలో మూడవ వంతుగా పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్న కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాదని ఆ దిశగా ఇప్పటికే ఫలవంతమైన భాగస్వామ్యాన్ని అందించిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఇప్పటికే నగరానికి చెందిన మూడు కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ తయారీ సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నాయని త్వరలోనే వ్యాక్సిన్ ఇక్కడి నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్న ఆశ ఉందని ఈ విషయం పట్ల తనకు గర్వంగా ఉన్నదని కేంద్రమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.దీంతో పాటు అనేక ఇతర ఫార్మా కంపెనీలు సైతం కరోణ చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందుల తయారీ లో లుపంచుకుంటున్నయని అని తెలిపారు.

గతవారం బయోటెక్ పరిశ్రమ వర్గాలతో తాను ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న మంత్రి దేశీయంగా బయోటెక్ పరిశ్రమలు మరింత ఉన్నత స్థానాలకు తీసుకుపోయేందుకు బయోటెక్ రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలను, అందుకు తీసుకోవాల్సిన చర్యలను మంత్రి తన లేఖలో ప్రస్తావించారు.ఈ లేఖలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను ప్రస్తావిస్తూన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ అనుమతులు మరియు టెస్టింగ్ ట్రాకింగ్ వ్యవస్థను మరింత వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా క్లినికల్ ట్రయల్స్ , వ్యాక్సిన్ల తయారీ వంటివాటిలో మరింత సులభంగా కంపెనీలు ముందుకు పోయే అవకాశం ఉన్నదని తెలిపారు.

దీంతోపాటు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండింగ్ మద్దతు విషయాన్ని మంత్రి తన లేఖలో ప్రస్తావించారు.ప్రస్తుతం సెంట్రల్ డ్రగ్ లాబరేటరీ హిమాచల్ప్రదేశ్లోని కసౌలి లో ఉన్నదని, ఈ కేంద్రం బ్రిటిష్ పరిపాలన కాలంలో ఏర్పాటు చేసిందని ఇప్పటికీ అక్కడ కొనసాగడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఇతర బయోటెక్ ఇబ్బందిగా మారిందని మంత్రి అన్నారు. గతంలో లాక్ డౌన్ ఉన్నప్పుడు ప్రయాణ సౌకర్యాలు సరిగా లేనందు వలన సెంట్రల్ డ్రగ్ లాబరేటరీ కి శాంపిళ్లను పంపడంలో బయోటెక్ పరిశ్రమలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రస్తుతం మరింత వేగంగా వ్యాక్సింగ్ తయారు చేసే ఉద్దేశంతో కంపెనీలు పని చేస్తున్న నేపథ్యంలో వారికి కొంత సులభంగా అనుమతులు ఇచ్చే ఈ విషయాన్ని పరిశీలించాలన్నారు. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా ఇచ్చిన వెసులుబాటును శాశ్వతంగా ఉండేలా చూడాలని కోరారు.

ప్రపంచ బయోటెక్ రంగంలో భారత దేశాన్ని మరింత అగ్ర స్థానంలో నిలిపి అక్కడి పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే అనుమతులు, క్లియరెన్స్ ల విషయంలో మరింత సులభంగా ఉండేలా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ దిశగా వికేంద్రీకరణ కోసం కేంద్రం చర్యలు తీసుకొని CDSCO జోనల్ కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న ఈ జోనల్ కార్యాలయానికి మరిన్ని అధికారాలు, నిధులు ఇచ్చి బలోపేతం చేయాలని మంత్రి తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.తద్వారా కంపెనీలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.

భారతదేశంలో వాక్సిన్ ల తయారీలో సుమారుగా 6 కేంద్ర మంత్రిత్వ శాఖలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ అనుమతుల ప్రక్రియ ఉంటుందని తెలిపిన మంత్రి కేటీఆర్, ప్రపంచ పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే ఈ కాంప్లెక్స్ ప్రక్రియను కొంత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సులభతరం చేస్తూ కఠినమైన నిబంధనలతోనే సులభంగా, ఆలస్యం కాకుండా వ్యాక్సిన్లు అనుమతి లభించే తీరుగా నూతన విధానాన్ని రూపకల్పన చేయాలని సూచించారు.

ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించి లైసెన్సింగ్ ప్రక్రియ పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్ డి ఎ ఎ వంటి సంస్థలు మార్గదర్శకాలను జారీ చేశారని ఈ గైడ్లైన్స్ కి, ప్రమాణాలకు అనుకూలంగా దేశీయంగా గైడ్లైన్స్ నీ త్వరగా రూపొందించాలని తద్వారా వాక్సిన్ తయారీలో కంపెనీలకు ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు.

వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మరియు తయారీ పైన కూడా మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు.ఇప్పటికే రెండు కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న విషయాన్ని పేర్కొన్న మంత్రి కేటీఆర్ వ్యాక్సిన్ ట్రయల్స్ కి సంబంధించి నూతన ఫ్రేమ్వర్క్ ని ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతోపాటు కంపెనీలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి పెట్టుకొని విజయవంతంగా ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేసే విధంగా అవకాశం ఇవ్వాలన్నారు.తద్వారా విజయవంతమైన వ్యాక్సిన్ పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని సూచించారు.

త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఏర్పడుతున్న నేపథ్యంలో వాక్సిన్ ప్రోకూర్మెంట్ పాలసీని సైతం ప్రభుత్వం సిద్ధంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని తద్వారా వ్యాక్సింగ్ కొందరికి మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఇప్పటికే పీఎం కేర్స్ నిధి ద్వారా సుమారు 100 కోట్ల రూపాయలను వ్యాక్సిన్ తయారీ చేస్తున్న కంపెనీల కోసం కేటాయించిన నేపథ్యంలో వాటిని వారికి అందించే మార్గదర్శకాలను సిద్ధం చేయాలని దీంతోపాటు వ్యాక్సిన్ తయారీలో ముందువరుసలో ఉన్న కంపెనీలకు మరింత ఫండింగ్ ఇచ్చేలా నూతన నిధిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. తద్వారా వేగంగా వాక్సిన్ తయారు చేసే అవకాశం ఉంటుందని, ఈ విషయం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కేటీఆర్ కోరారు

ప్రపంచ వాక్సిన్ తయారీ రంగంలో భారత్ లీడర్ పొజిషన్లో ఉన్నదని ఇలాంటి సంక్లిష్ట సమయంలో సరైన నిర్ణయాలు వేగంగా తీసుకోకుంటే ఆ పొజిషన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా అధికారులతో పాటు పరిశ్రమ వర్గాల తో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం మరింత బలోపేతం కావాలని కోరుకునే రాష్ట్రల్లో తెలంగాణ ఒకటని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా సహకారం పరిశ్రమకు లేదా కేంద్ర ప్రభుత్వానికి అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కి హామీ ఇచ్చారు.

- Advertisement -