- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షలు దాటాయి. రోజుకు 55 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తుండగా గత 24 గంటల్లో 57,117 పాజిటివ్ కేసులు నమోదుకాగా 764 మంది మృతిచెందారు.
ఇక దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,95,988కి చేరగా 5,65,103 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మహమ్మారి నుండి 10,94,374 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 36,511 మంది కరోనాతో మృతిచెందగా దేశంలో కరోనా రికవరీ రేటు 65 శాతంగా ఉంది.
గత 24 గంటల్లో 5,25,689 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఇప్పటివరకు 1,93,58,659 మందికి కరోనా పరీక్షలు చేశామని ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా మరణాల్లో భారత్ ఇప్పటికే ఇరాన్ను దాటేసి, అత్యధిక మరణాలు నమోదవుతున్న దేశాల్లో ఐదో స్థానంలో నిలిచింది.
- Advertisement -