- Advertisement -
ఐపీఎల్ నిర్వహణపై మరింత క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ మొత్తం 51 రోజుల్లో ఐపీఎల్‌ని పూర్తిచేసేలా బీసీసీఐ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే అన్ని ప్రాంఛైజీలు ఐపీఎల్ ప్రారంభమయ్యే నెలరోజుల ముందుగానే యూఏఈకి చేరుకునేలా ప్లాన్ చేశారు.
ఇప్పటికే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లని ఐపీఎల్ కోసం యూఏఈకి పంపేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు అంగీకారం తెలపాల్సి ఉంది.
మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా రాత్రి మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు బదులుగా 7.30గంటలకు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 20 నాటికి భారత క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు యూఏఈకి చేరుకోనుండగా 14 రోజుల క్వారంటైన్ తర్వాత క్రికెటర్లు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది.
- Advertisement -