ఏపీలో 704మందికి కరోనా పాజిటివ్

202
china coronavirus
- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. రోజుకి వేల సంఖ్యల్లో కరోనా కేసులు నమోదవుతుండంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గత 24 గంటల్లో 18,114 శాంపిళ్లను పరీక్షించగా మరో 704 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు.

కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 12,202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 14,595 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 6,770 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,245 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరో్నాతో 187మంది మరణించారు.

- Advertisement -