అల్లరి నరేష్ బర్త్ డే గిప్ట్ గా ‘నాంది’ టీజర్

15
nandi

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్. తాజాగా అల్లరి నరేష్ నటించిన చిత్రం నాంది. దర్శకుడు హరీశ్ శంకర్ వద్ద కో డైరెక్టర్ గా పనిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈచిత్రానికి అబ్బూరి ర‌వి, చోటా కె. ప్రసాద్‌, శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌, బ్రహ్మ క‌డ‌లి వంటి ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నారు.

ఈ చిత్రం న‌రేష్ కెరియ‌ర్‌లో 57వ చిత్రంగా రూపొందుతుండ‌గా, ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అల్లరి నరేష్ పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా కింద కూర్చుని ఉన్నాడు. ఇక ఈ రోజు న‌రేష్ బ‌ర్త్‌డే కావ‌డంతో ‘నాంది’ ఎఫ్ఐఆర్ (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరట గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.