ప్రజా వైద్యంలో రాజీ పడేది లేదు- మంత్రి ఈటెల

234
Minister Etela Rajender
- Advertisement -

గురువారం తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అస్సోషియేషన్ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు వైద్యం అందించే బాధ్యత వారిపై ఉందని గుర్తు చేశామని.. ప్రజలకు వైద్యం అందించడానికి సహకరించాలని అసోసియేషన్ ప్రతినిధులను విజ్ఞప్తి చేశామని మంత్రి అన్నారు. ప్రజలకు ధైర్యం కలిగించాలని కోరామని తెలిపారు. కొంతమంది కరోనా పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం సరి కాదని, కరోనా పాజిటివ్ ఉన్నా కూడా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందించాలి అని కోరారు. లక్షణాలు లేనివారికి హోమ్ ఐసోలేషన్ ఉంచాలని ఇప్పటికే ఆదేశించామని దానిని అందరూ పాటించాలని మంత్రి కోరారు.

ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా చికిత్స అందించేందుకు అనుమతినిచ్చామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కర్తవ్యంగా భావించి చికిత్స అందించాలని మంత్రి కోరారు. ఐసీ యు లోనున్న పేషెంట్లకు ప్రభుత్వం రేట్ల ప్రకారమే చికిత్స అందించాలని తెలిపారు. పిపీఈ కిట్స్ వినియోగం, మందుల వినియోగంకి అయ్యే ఖర్చు నీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తీసుకోవాలని మంత్రి కోరారు. ఏది ఏమైనా ప్రజా వైద్యంలో రాజీ పడేది లేదు అని అన్నారు. ఎంత మంది పేషంట్లు వచ్చినా చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి అని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ఉన్న ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేశారని త్వరలనే విడుదల చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

- Advertisement -