కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా హర్బజన్ సింగ్ – అండ్రూ సైమండ్స్ మధ్య జరిగిన గొడవ గురించి తెలిపాడు ఆసీస్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్.
హర్భజన్ సింగ్‌తో గొడవ కారణంగా ఐపీఎల్లో ఆడేందుకు ఆండ్రూ సైమండ్స్ నిరాకరించడాని తెలిపారు. 2008లోనే ఐపీఎల్ ప్రారంభమవగా.. వేలంలో ఆండ్రూ సైమండ్స్‌ని రూ. 5.4 కోట్లకి దక్కన్ ఛార్జర్స్ కొనుగోలు చేసింది. అయితే భజ్జితో గొడవకారణంగా తాను ఆడనని చెబితే …ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెటర్లని ఐపీఎల్లో ఆడేలా ఒప్పించే బాధ్యతని తనకి అప్పగించాడని మాక్స్వెల్ గుర్తుచేసుకున్నాడు.
2008లో ఆస్ట్రేలియా పర్యటనలో ఆండ్రూ సైమండ్స్‌ని కోతితో పోల్చిన హర్భజన్ సింగ్ ‘మంకీగేట్’ వివాదానికి తెరలేపాడు. దాంతో..భజ్జీపై నిషేధంపడగా.. ఆ శిక్షని ఎత్తివేయకపోతే సిరీస్‌ని బహిష్కరిస్తామని భారత క్రికెటర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సైమండ్స్…ఐపీఎల్ ఆడటానికి నిరాకరించాడు. అయితే మ్యాక్స్‌వెల్ మధ్యవర్తిత్వంతో ఐపీఎల్ ఆడిన సైమండ్స్… దక్కన్ ఛార్జర్ తరఫున 2008 నుంచి 2010 వరకూ ఆ తర్వాత 2011లో హర్భజన్ సింగ్‌తో కలిసి ముంబయి ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.