ఒక్కరోజే 11 వేల కేసులు..4వ స్ధానంలో భారత్

203
india coronavirus
- Advertisement -

భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దేశంలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటింది. గత 24 గంటల్లో 10956 కేసులు నమోదయ్యాయి.

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా వైరస్‌ వల్ల 396 మంది మరణించగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 297535కు చేరింది. 141842 యాక్టివ్ కేసులు ఉండగా 147195 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 8498 మంది మృత్యువాతపడ్డారు.

మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే 3607 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 152 మంది మరణించారు. ఓవరాల్‌గా మహారాష్ట్రలో 97648 కోవిడ్‌19 కేసులు నమోదు అయ్యాయి. ఒక కరోనా పాజిటివ్ కేసుల్లో ప్రపంచదేశాలతో పోలిస్తే నాలుగో స్ధానంలో నిలిచింది భారత్‌. తొలి మూడు స్ధానాల్లో అమెరికా, బ్రెజిల్ ,రష్యా ఉన్నాయి.

- Advertisement -