- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు లక్షల సంఖ్యలో మృత్యువాత పడగా భారత్లో కూడా కరోనా పంజా విసురుతూనే ఉంది. ప్రపంచదేశాల్లోకరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ ఆరోస్ధానంలో నిలవగా ఇటలీని దాటేసింది భారత్.
ప్రస్తుతం భారత్లో 2 లక్షల 36 వేల 657 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇటలీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 3వేలు. భారత్లో అత్యధికంగా మహారాష్ట్రలో 80 వేల కేసులు నమోదుకాగా దేశంలో మరణించిన వారి సంఖ్య 6600కు చేరుకుంది.
సుమారు 19 రాష్ట్రాల్లో కరోనా సోకిన కేసుల సంఖ్య నాలుగు అంకెలకు చేరుకోగా అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ , ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
- Advertisement -