సర్కార్ వారి పాట…అప్ డేట్స్!

788
mahesh sarkarvari pata
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా గీతాగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారువారి పాట. ఇటీవలె కృష్ణ బర్త్ డే సందర్భంగా టైటిల్‌ లుక్‌ని రివీల్ చేయగా ప్రేక్షకుల నుండి మంచిస్పందన వచ్చింది.

తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. షూటింగ్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో సాంగ్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారట మహేశ్-దర్శకుడు పరశురామ్.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్నాయి. బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్‌ డ్రామాగా మూవీ తెరకెక్కుతుండగా ఓ బ్యాంకు మేనేజర్‌ కొడుకుగా మహేశ్‌ కనిపించనున్నట్లు టీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది.

- Advertisement -