తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్రను సినిమాగా తెరకెక్కించాలని కొంత మంది డైరెక్టర్లు ఇప్పటికే ప్రయత్నలు మొదలుపెట్టారు. జయలలిత గత నెల డిసెంబర్ 5న మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణం తమిళనాడుకు తీరని లోటుని పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేసారు. తమిళప్రజలు ప్రేమగా పిలుచుకునే అమ్మ ఇక లేరని వార్త తెలియడంతో తమిళతంబిలు జీర్ణంచుకోలేకపోతున్నారు.
జయలలిత కేవలం రాజకీయ రంగంలోనే కాకుండా సిని పరిశ్రమతో కూడా ఆమెకు అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. సినిమా హీరోయిన్గా అప్పట్లో జయలలిత స్టార్ డమ్ క్రియ్ట్ చేసింది. ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ, శోభన్‌బాబు ఇలా అప్పట్లో టాప్ హీరోల సరసన నటించింది జయ. అయితే ఇప్పుడు ఆమె జీవిత చరిత్రను సీనియర్ డైరెక్టర్ దర్శకరత్న దాసరినారాయణరావు సినిమా తీయాలని నిర్ణయించుకున్నరట.
ఇప్పటికే తన దగ్గర ఉన్న రైటర్స్‌తో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నారట దాసరి. తానే స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేసేలా అమ్మ జీవితచరిత్రను తీసున్నారట. ఇప్పటికే సినిమా టైటిల్ “అమ్మ” గా ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించడని ఫిల్మ్‌నగర్‌లో గుసగులు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట
తర్వలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెల్లనున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో జయలలిత క్యారెక్టర్ ఎవరు చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. అప్పట్లో త్రిష అమ్మ రోల్ చేస్తుందని తెగ హడావిడి చేశారు. ఇటీవలే రమ్యకృష్ణ కూడా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ….నా డ్రీమ్ రోల్ జయలలిత పాత్ర చేయడంమే అని చెప్పింది. దీంతో జయలలిత జీవితచరిత్రను ఎవరు తెరకెక్కించడానికి ముందుకు వచ్చినా, ఆమె పాత్రలో నటించడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్పుకొచ్చింది రమ్యకృష్ణ. అమ్మలాగే అచ్చుగుద్దినట్లుగా ఉన్న రమ్యకృష్ణ ఫొటోలు ఇటీవలే సోషల్ మీడియాలో హాల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కోలివుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రమ్యకృష్ణ అమ్మ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు తెలుగులో తీసే జయలలిత సినిమాపై హీరోయిన్ ఎవరన్నదనిపై క్లారిటీ రావలంటే దాసరి నారయణరావు అఫిషియల్ ఎనౌన్స్మెంట్ చేసే వరకు వేచిచూడాల్సిందే. ఇక ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడలేదు.