నేను అలాంటి దాన్ని కాదు..

122
Shraddha

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్‌ ఎఫైర్ విషయంపై బీ టౌన్‌ లో పెద్ద దుమారమే చలరేగింది. సహా నటుడు బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ తో శ్రద్ధా ప్రేమలో పడిందని..ఇద్దరు కలిసి ఒకే అపార్ట్ మెంట్‌లో ఉంటూ సహాజీవనం చేస్తున్నారనే వార్తలు గుప్పమాన్నాయి. వీరిద్దరి వ్యవహారం నచ్చని ఆమె తండ్రి (శక్తి కపూర్) ఫర్హాన్ అపార్ట్మెంట్ నుంచి శ్రద్ధాను బలవంతంగా బయటకి లాకొచ్చిన్నట్టుగా కథనాలు వచ్చాయి. ఈ విషయంపై శ్రద్ధా కపూర్ ఎట్టకేలకు మౌనం వీడింది. ఎఫైర్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సహనటుడు, హీరో ఫర్హాన్ అక్తర్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందన్న విషయాన్ని పూర్తిగా తోసిపుచ్చింది. ఈ తప్పుడు కథనాలు తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయని పేర్కొంది. నేను అలాంటి దాన్ని కాదని తేల్చిచెప్పింది.

Shraddha

తామూ మనుషులమే అన్న సంగతిని గుర్తించనంతవరకు ఇలాంటి రూమర్లు వస్తూనే ఉంటాయని తెలిపింది. సినీ నటులుగా ఉన్న తమలాంటి వారిపై గాసిప్స్ చదవడానికి సామాన్య జనం ఆసక్తి చూపిస్తారు. కానీ, ఇలాంటి కథనాలు తన తండ్రిని, ఆంటీని, తన సహనటుడిని జోడించడం సరికాదని వ్యాఖ్యానించినట్టుగా “బొంబాయి టైమ్స్ ‘ రిపోర్టు చేసింది. ఇదే విషయాన్ని సీనియర్ కూడా కపూర్ ఖండించారు. మరి శ్రద్ధా క్లారిటీతోనైనా ఈవార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ఆషిక్ 2 సినిమాలో గాయకురాలి పాత్రలో ఆకట్టుకున్న శ్రద్ధా తాజా చిత్రం ‘ఒకే జాను’ సినిమా బిగ్ రిలీజ్ కు సిద్ధంమవుతున్న సంగతి తెలిసిందే.

Shraddha