సాగు విధానంపైనేడు సీఎం కేసీఆర్ సమావేశం

290
cm kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఇవాళ మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆ సమావేశానికి ఆహ్వానించారు.

వారితో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల సాగుపై చర్చిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలను చర్చించనున్నారు.

ఈ సమావేశంలో జిల్లాల వారీగా పంటల మ్యాప్ ను రూపొందించి ఎక్కడ ఏ పంట వేయాలి అనే అంశంపై చర్చించనున్నారు.

- Advertisement -