- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఒక్కరోజే 79 కేసులు నమోదుకాగా ఇందులో జియాగూడ డివిజన్ పరిధిలోనే 25 ఉన్నాయి. దీంతో స్ధానికంగా ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
జియగూడ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జియాగూడ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో దుకాణాలను మూసి వేసి జన సంచారం లేకుండా చర్యలు చేపట్టారు. డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా మార్చి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించాలని స్ధానికులు అధికారులను కోరుతున్నారు.
- Advertisement -