- Advertisement -
హైదరాబాద్,సైబరాబాద్,రాచకొండ పోలీసులు సరికొత్త నిబంధన అమలు చేస్తున్నారు. బైక్‌కు సైడ్ మిర్రర్ లేకపోతే ఫైన్ వేయడం ప్రారంభించారు. మోటార్ వెహికల్ యాక్ట్ 177 సెక్షన్ ప్రకారం సైడ్ మిర్రర్ లేకుంటే ఫైన్ కట్టాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు.
బైక్‌లకు సైడ్ మిర్రర్‌లు ఉండటం వల్ల వెనక నుంచి వచ్చే వాహనాలు కనిపించి జాగ్రత్తగా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుందని, ఈ చలాన్‌లు విధించడం మంచిదే అని కొంతమంది పోలీసుల తీరును సమర్థిస్తున్నారు. ఫైన్ రూ. 100,యూజర్ ఛార్జీలు రూ. 35తో కలిపి 135 ఫైన్ చెల్లించాలని ఈ చలాన్ ద్వారా ప్రజలు తమ బైకులపై చలాన్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
అయితే పోలీసుల తీరుపై ప్రజల నుండి నిరసన వ్యక్తమవుతోంది. తొలుత అవగాహన కల్పించి తర్వాత చలాన్ విధించాలని కొంతమంది నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
- Advertisement -