ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా: ష‌మీ

274
shami
- Advertisement -

కరోనాతో కాస్త రిలీఫ్ లభించడంతో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటున్నారు భారత క్రికెటర్లు. తాజాగా భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఒకానొక‌ద‌శ‌లో ఏకంగా మూడుసార్లు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించానని…రోహిత్ శర్మతో తన అభిప్రాయాలను పంచుకున్నాడ షమీ. ఫ్యామిలీ అంతా స‌పోర్టుగా నిల‌వ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని విర‌మించుకుని కెరీర్‌పై దృష్టి సారించిన‌ట్లు తెలిపాడు.

తానుఉండే అపార్ట్‌మెంట్‌లో 24 అంత‌స్థులు ఉండేద‌ని, తానెప్పుడైనా అక్కడి నుంచి దూకుతానేమోన‌ని ఇంట్లోవాళ్లు తెగ ఆందోళ‌న ప‌డేవార‌ని తెలిపాడు. వాళ్లు లేకుంటే త‌న క్రికెట్ కెరీర్ ఎప్పుడో అంత‌మై ఉండేద‌ని పేర్కొన్నాడు.

- Advertisement -