కివీస్‌తో టీ20..కోహ్లీ సేన ఇదే

185
kohli

న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ నెల 24 నుంచి టీ 20 సిరీస్ ప్రారంభంకానుండగా టూర్‌లో భాగంగా ఐదు టీ20లు,మూడు వన్డేలు,రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి ఇరు జట్లు.

అయితే వన్డే,టెస్టు సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించాల్సి ఉన్నా వాయిదా వేసింది బీసీసీఐ. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు ఈ సారి నిరాశే మిగలగా లంకతో సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ జట్టులోకి తిరిగొచ్చారు.

టీ20 జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ‌, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషబ్‌ పంత్‌, శివం దూబే, కుల్దీప్ యాదవ్‌‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌.