కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాశారు. ఇందులో రైతులు పండించిన పంటలను అమ్ముకునే విషయంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి అధ్యక్షులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండించారు.
కాంగ్రెస్ నేతలు ఈ రాష్ట్రం లోనే ఉంటున్నారా, లేదా , వారు రోజూ వార్తాపత్రికలు చదువుతున్నారా లేదా, మరియు రోజు టీవీ చానల్స్ లో వార్తలు చూస్తున్నారా లేదా అని అనుమానం వస్తుంది. ఏదో తంతుగా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఉంది ఎందుకనగా వారు లేఖలో కేవలము 2400 ధాన్య సేకరణ కేంద్రాలు పనిచేస్తున్నట్లు రాసినారు, ఇది ఒకటి వారికి రైతుల పైన ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది మరియు వారు ఇప్పుడే నిద్రలో నుంచి మేలు కొన్నట్లు గా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ చాలా ముందుచూపుతో రైతులు పండించిన ధాన్యపు గింజలు కొనుగోలు చేయుటకై పకడ్బందీ వ్యూహంతో రాష్ట్ర అధికారులను జిల్లా అధికారులను మరియు గ్రామ అధికారులను సన్నద్ధం చేసి ఇప్పటికే రాష్ట్రంలో వరి మొక్కజొన్న శనగలు మరియు నల్ల కుసుమలు కొనుగోలు చేపట్టారని తెలిపారు.