- Advertisement -
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితులు పెరిగిపోతున్నారు. కరోనా ఎవర్ని వదలడం లేదు. 190 దేశాలకు ఈ వైరస్ సోకింది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈవైరస్ సోకుతుంది. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని వదలడం లేదు. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జోన్సన్ కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. తాను కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు.
గత 24 గంటల్లో శరీరంలో కొద్దిగా టెంపరేచర్ పెరిగిందని, పదేపదే దగ్గు రావడం వల్ల.. డాక్టర్లను సంప్రదించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను స్వీయ నిర్భందంలో ఉన్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ రావడంతో ఇంటి నుంచే పరిపాలన చేస్తున్నట్లు చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
- Advertisement -