తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల..

422
ts
- Advertisement -

తెలంగాణలో పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో ఎంటెక్‌, ఎంఫార్మా ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి బుధవారం విడుదలచేశారు. ఈ పరీక్షల కోసం మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. ఆన్ లైన్ విధానం ద్వారా మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

జరిమానాతో మే 26 వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. మే 20 నుంచి మే 27 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పీజీ ఈసెట్ లో భాగంగా మే 28 నుంచి మే 31 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 15న ఫలితాల వెల్లడి ఉంటుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పీజీ ఈసెట్‌ నోటిఫికేషన్ జారీ : మార్చి 3, 2020
ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ ప్రారంభ తేది : మార్చి 12.2020
అప్లికేషన్‌ గడువుకు చివరి తేది : ఏప్రిల్‌ 30, 2020
ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువు : మే 26,2020
హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ : మే 20 నుంచి 27 మే వరకు
పరీక్ష తేదీలు : మే 28 నుంచి 31మే వరకు
పరీక్షా ఫలితాలు : జూన్‌ 15, 2020

- Advertisement -