పసిడి ధర మళ్లీ పైపైకి..

381
gold
- Advertisement -

పసిడి ధర పరుగులు పెడుతోంది. మళ్లీ కొండెక్కి కూర్చుంది. కొత్త గరిష్ట స్థాయికి చేరింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. బుధవారం ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం(24 క్యారెట్లు) ధర రూ.42,339కి చేరుకుంది. ముందు రోజుతో పోల్చితే రూ.462 పెరిగింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ఒక్క రోజులో రూ.1,047 మేర ఎగబాకి రూ.48,652కి పెరిగింది.

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.41,120, విజయవాడలో రూ.41,900, విశాఖపట్నంలో రూ.42,920, ప్రొద్దుటూరులో రూ.41,550, చెన్నైలో రూ.41,630గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.39,180, విజయవాడలో రూ.38,800, విశాఖపట్నంలో రూ.39,480, ప్రొద్దుటూరులో రూ.38,480, చెన్నైలో రూ.39,650గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.47,500, విజయవాడలో రూ.49,500, విశాఖపట్నంలో రూ.49,100, ప్రొద్దుటూరులో రూ.48,600, చెన్నైలో రూ.51,800 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో అంటే.. ఏడేళ్ల గరిష్ఠంలో ఉంది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై కరోనా వైరస్ మబ్బులు కమ్ముకున్న నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్‌ పెరిగింది. దాని ఫలితంగా దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి రేట్లు పుంజుకున్నాయి. అదీకాక.. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండటంతో ఆభరణాల కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. దీంతో రేట్లు కూడా పెరిగిపోయాయి.

- Advertisement -