డిసెంబ‌ర్ 16 న నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్…

352
Nanna Nenu Naa Boyfriends
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నుండి సినిమా వస్తుందన్నా, ఆయన ఏదైనా సినిమాను రిలీజ్ చేస్తున్నారన్నాతప్పకుండా సినిమా ఆడియెన్స్‌ను అల‌రించే సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌కం అందరి మ‌దిలో ఉంది. ప్ర‌స్తుతం ట్రెండ్‌కు త‌గిన విధంగా యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ క‌ల‌సి చూసే సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌డంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి టెస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు బ్యాన‌ర్ నుండి విడుద‌ల‌వుతున్న మ‌రో చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`. ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి ప‌దేళ్లుగా మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్‌(గోపి) రీసెంట్‌గా `సినిమా చూపిస్త మావ‌`తో సూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే.

  Nanna-Nenu-Naa-Boyfriends-Theatrical-Trailer-Talk

ల‌క్కీ మీడియా బ్యానర్‌పై భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`. రీసెంట్‌గా విడుదల చేసిన `నాన్న నేను నా బాయఫ్రెండ్స్` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా చూసిన దిల్‌రాజు ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ముందుకు రావ‌డంతో సినిమా స‌క్సెస్‌పై యూనిట్‌లో న‌మ్మ‌కం పెరిగింది. `కొత్త‌బంగారు లోకం` సినిమా చూడ‌గానే నేను ఎలా ఫీల‌య్యానో `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్` సినిమా చూడ‌గానే అలానే ఫీల‌య్యాను. `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్` చిత్రం త‌ప్ప‌కుండా మ‌రో `కొత్త బంగారు లోకం` సినిమాలా హ్యూజ్ స‌క్సెస్ సాధిస్తుంద‌ని దిల్‌రాజుగారు చెప్ప‌డం విశేషం.

Nanna Nenu Naa Boyfriends

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోన్న `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్` మూవీ ఆడియో రిలీజ్ డిసెంబ‌ర్ 7న జ‌ర‌గ‌నుంది. అలాగే డిసెంబ‌ర్ 8న సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 16న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -