తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళ సై సౌందర్ రాజన్ ను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కాసేపటి క్రితమే కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. 4రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోం శాఖ.
తమిళనాడు బీజేపీ యువ మహిళా నేతగా తమిళ సై సౌందర్ రాజన్ మంచి గుర్తింపు ఉంది. ఇటివలే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సౌందర్ రాజన్ ఓటమి పాలయ్యారు. డీఎంకే మహిళా నేత కనిమోళిపై ఆమె స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటి నుంచి ఆమె బీజేపీలో అంకితభావంతో పనిచేయడంతో ఆమెకు ఈపదవి దక్కిందని చెబుతున్నారు. సౌందర్ రాజన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కూడా చేశారు. అంతేకాకుండా
ఇక హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ గా బండారు దత్తాత్రేయను నియమించారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ గా భగత్ సింగ్ కోశ్యారిని , రాజస్థాన్ గవర్నర్ గా కల్ రాజ్ మిశ్రాను, కేరళకు ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.