- Advertisement -
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తెలంగాణ గవర్నర్ కార్యాలయానికి చేరాయా? లేదా? అన్న విషయమై స్పష్టత రావాల్సి వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 9 సంవత్సరాలకు పైగా నరసింహన్ గవర్నర్ గా కొనసాగిన సంగతి తెలిసిందే.
ఆయన గవర్నర్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అటు ఏపీ సీఎం చంద్రబాబును, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ ను సమన్వయ పరిచేందుకు తనవంతు కృషి చేశారు.
ఆయన సేవలు తెలంగాణ కంటే, జమ్మూ కాశ్మీర్ లో అవసరమని భావిస్తున్న హోమ్ శాఖ, శ్రీనగర్ లో కీలక బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ గవర్నర్ గా తమిళనాడుకు చెందిన వ్యక్తిని నియమించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉంది.
- Advertisement -