అల..వైకుంఠపురంలో ఫస్ట్ లుక్ రిలీజ్..

592
ala-look
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మూవీ అల.. వైకుంఠపురంలో. ఇటివలే ఈచిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఈటీజర్ లో బన్నీ చెప్పిన డైలాగ్ అద్బుతంగా ఉందంటున్నారు ప్రేక్షకులు. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నా.. ఈ సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీగా వస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. సెక్యూరిటీ గార్డ్ సిగరెట్ వెలిగిస్తుంటే.. అల్లు అర్జున్ అలా కూర్చోని ఉన్న లుక్‌ను విడుదల చేశారు. అల్లు అర్జున్ నటిస్తున్న 19వ చిత్రమిది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాని విడుదల చేయనున్నారు.

ఇక బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఈరెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఈమూవీ కూడా పక్కాగా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నాడు బన్నీ. ఈమూవీలో బన్నీ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -