కావ్య భాషగా తెలంగాణ భాష: నందిని సిద్దారెడ్డి

885
nandini siddareddy
- Advertisement -

తెలంగాణ భాష.. కావ్య భాషగా మారడం సాహిత్యంలో గొప్ప పరిణామం అన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిద్దారెడ్డి. సిద్దిపేట సాహిత్య సభలో మాట్లాడిన ఆయన తెలంగాణ కవులు తెలంగాణ భాషతో పాటు,తెలంగాణ జీవితాన్ని ,సంస్కృతి, సంప్రదాయాలను,సైతం కవిత్వం లోకి తెస్తున్నారని చెప్పారు.

సామాజిక పరిణామాలను,జీవన విధ్వంసాన్ని తెలంగాణ కవులు అద్భుతంగా కవిత్వంలోకి తెస్తున్నారని.. యువకవి గంభీర్రావు పేట యాదగిరి తన గల్మ కవితా సంపుటిలో మానవతావిలువల ను గొప్పగా చిత్రీకరించాడని చెప్పారు.

కవి వ్యక్తిత్వం కవిత్వం లో కనిపిస్తుందన్నారు దేశపతి శ్రీనివాస్. మహాకవి పోతన నుండి మొదలైన కవిత్వ వారసత్వం తెలంగాణ ప్రాంత కవుల్లో ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. వచన, పద్య సాహిత్యంలో ఎంతో మంది కవులు అద్భుతమైన సాహిత్యాన్ని వెలువరిస్తున్నారని చెప్పారు.

కవి స్వభావం కవిత్వం లో ప్రతిబింబిస్తుంది.. గంభీర్రావుపేట యాదగిరి కవిత్వంలో అతని స్వభావం కనిపిస్తుందని కొనియాడారు. కొత్తగారాస్తున్న కవులు తమకు ముందు వచ్చిన కవిత్వ పరిణామాల ను, కవుల కవిత్వాన్ని చదవాలన్నారు. పోతన,జాషువా,శ్రీ,శ్రీ దాశరథి,కాళోజీ,సినారె వంటి కవులు తమకు ముందు వచ్చిన అన్ని రకాల సాహిత్యాన్ని చదివి తమ అనుభవాల్లోంచి గొప్ప సాహిత్యాన్ని వెలువరించారని చెప్పారు. సామాజిక సంచలనాలను,పరిణామాలను కవులు పరిశీలించాలి .. వాటిని కవిత్వీకరించాలి అప్పుడే మంచి సాహిత్యం వెలువడుతుందన్నారు దేశపతి శ్రీనివాస్‌.

- Advertisement -