టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈసందర్భంగా దసరా పండుగకల్లా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని నేతలకు పార్టీ అధినేత నిర్దేశం చేశారు. జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణ నమూనాలు నేతలకు అందజేశారు. అదేవిధంగా ఒక్కో జిల్లా కార్యాలయ నిర్మాణానికి రూ. 60 లక్షల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు , విప్ , తెరాస ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు . కరీంనగర్ జిల్లాకు సంబంధించిన చెక్కును మంత్రి ఈటెల రాజెందర్ కు అందజేశారు సీఎం కేసీఆర్. వనపర్తి జిల్లా కు సంబంధించిన చెక్కును మంత్రి నిరంజన్ రెడ్డికి ఇవ్వగా, సిద్దిపేట జిల్లా చెక్కును మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు అందజేశారు.
ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన చెక్కును మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అందజేయగా, జగిత్యాల జిల్లాకు సంబంధించిన చెక్కును మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అందజేశారు. ఇక చేవెళ్లకు సంబంధించిన చెక్కును పార్లమెంట్ సభ్యులు డా.రంజీత్ రెడ్డికి అందజేశారు.