యాంకర్ అనసూయ బుల్లి తెరపై వచ్చె కామెడీ షో లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ మంచి గర్తింపు తెచ్చుకుంది. తన అందం, డ్యాన్స్ , నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. అప్పడప్పుడు వెండితెరపై కూడా తన టాలెంట్ చూపిస్తుంది. ఇటివలే విడుదలైన పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. అంతేకాకుండా మెగాస్టార్ కొరటాల శివ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.
తాజాగా ఉన్న సమాచారం ప్రకారం అనసూయ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది. నటనపై తన అదృష్టాన్ని పరిక్షించుకుని సక్సెస్ అయిన అనసూయ నిర్మాణం రంగంలో కూడా సక్సెస్ సాధించేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అసనూయ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.
అందులో నటిస్తూనే సినిమా నిర్మాణ సంస్ధను స్ధాపించాలని అనుకుంటుందట. ఈవిషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కొత్త టాలెంట్ ను ప్రొత్సహించాలన్న ఉద్దేశ్యంతోనే చిత్ర నిర్మాణంలోకి దిగనున్నట్టు తెలిపింది.