వరల్డ్ కప్ ఎఫెక్ట్…ఇస్మార్ట్ శంకర్ వాయిదా

375
ismart-shankar
- Advertisement -

పూరీ జగన్నాథ్ , హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. నభా నటేష్, నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పనులు ముగింపు దశకి చేరుకున్నాయి.ఈ సినిమాను జూలై 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే ప్రపంచకప్ మ్యాచ్ ల కారణంగా ఈసినిమా విడుదల వాయిదా పడింది.

వరల్డ్ కప్ మ్యాచ్ లు ఉండటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. వరుస సినిమాలు థియేటర్స్‌లోకి వస్తున్నప్పటికి వరల్డ్ కప్ ఎఫెక్ట్‌తో ఎప్పుడూ కళకళలాడే థియేటర్లు వెలవెలబోతున్నాయి. థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయి.. కలెక్షన్లు కూడా భారీగా డ్రాప్ అవుతున్నాయి. జులై 18న ఈసినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్.

- Advertisement -