ఏపీలో కొత్తగా 97 మందికి కరోనా పాజిటివ్..

152
ap coroana
- Advertisement -

ఆంధ్రపదేశ్‌లో గడచిన 24 గంటల్లో 33,876 కరోనా పరీక్షలు నిర్వహించగా 97 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,275 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,046 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,071కి పడిపోయింది. అటు మొత్తం మరణాల సంఖ్య 7,158కి చేరింది.

కొత్తగా నమోదైన కేసులలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 25 కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా జిల్లాలో 11, విశాఖపట్నం జిల్లాలో 10 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -