- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ సిబ్బందికి 96.19%, మిగతా 141 మున్సిపాలిటీలలోని సిబ్బందికి 95.55% టీకా పంపిణీ కార్యక్రమం పూర్తయిందన్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ విభాగంలో టీకా పంపీణీ ప్రక్రియను వీలైనంత త్వరగా 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖలో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ కార్మికులందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నామని, వారందరికీ కరోనా టీకా ఇస్తున్నామని తెలిపారు.
- Advertisement -