దేశంలో 24 గంటల్లో 913 కరోనా కేసులు..

78
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 913 కరోనా కేసులు నమోదుకాగా 13 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,29,044కు చేరగా 4,24,95,089 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 5,21,358 మంది మృతిచెందగా ప్రస్తుతం దేశంలో 12,597 యాక్టివ్ కేసులున్నాయి.

యాక్టివ్‌ కేసులు 13 వేల దిగువకు చేరడం గత 714 రోజుల్లో ఇదే తొలిసారి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉండగా యాక్టివ్‌ కేసులు 0.03 శాతం, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.

- Advertisement -