సంగారెడ్డి ..పాప అదృశ్యం..వీడిన మిస్టరీ

320
sangareddy
- Advertisement -

సంగారెడ్డి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఎనమిది రోజుల శిశువును ఓ గుర్తు తెలియని మహిళ అపహరించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు పాప ఆచూకీని కనుగోన్నారు. ఎల్లారెడ్డి సమీపంలో పాపను గుర్తించారు పోలీసులు. రెండు రోజులుగా తల్లిపాలు లేక పాప నీరసించిపోయింది.పాపను మెదక్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాప అదృశ్యానికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

సంగారెడ్డి మండలం కల్పగూర్‌కి చెందిన హన్మోజిగారి మల్లేశం భార్య మాధవి గత నెల 29న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 4 రోజుల క్రితం శిశువుకు కామెర్లు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఉదయం 9 గంటలకు గుర్తు తెలియని ఓ మహిళ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలోకి ప్రవేశించింది. అక్కడున్న వనిత అనే ఆయా నిర్లక్ష్యంతో ఆ గుర్తు తెలియని మహిళను మల్లేశం కుటుంబసభ్యులని భావించి శిశువును ఆమెకు అప్పగించింది.

అనంతరం బిడ్డను తీసుకుని ఆ మహిళ పరారైంది. ఆస్పత్రి లోపల, బయట సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు కేసు మిస్టరీని రెండు రోజుల్లో చేధించారు.

- Advertisement -