ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తాం:హరీష్‌

258
harish rao

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నెరవేస్తామని స్పష్టంచేశారు ఎమ్మెల్యే హరీశ్‌ రావు. సంగారెడ్డిలో రెండోసారి మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన కొత్త ప్రభాకర్ రెడ్డికి సన్మానసభ జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు హరీశ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కష్టపడి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపుకోసం కృషి చేశారని తెలిపారు.

మెదక్ నియోజకవర్గ ప్రజలు కొత్త ప్రభాకర్ రెడ్డి కి పెద్దఎత్తున అండగా ఉన్నారు. ప్రజలిచ్చిన స్పూర్తితోరాబోయే రోజుల్లో ప్రజా సేవ కు అంకితమవుతామని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ తో మెదక్ ప్రజలకు సాగునీరు అందిస్తామన్నారు.

రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 5వేలు ఇవ్వనున్నామని పెంచిన ఫించన్లు కూడా ప్రజలకు అందిస్తామన్నారు.పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు టీ ఆర్ ఎస్ పార్టీ గెలిచిందని చెప్పిన హరీష్ భువనగిరిలో రోడ్ రోలర్‌ గుర్తు వల్ల టీఆర్ఎస్ ఓడిందన్నారు.

కార్యకర్తల కృషి వల్లనే భారీ మెజారిటీతో గెలిచానని తెలిపారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన మెదక్ నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషచేస్తానని తెలిపారు. కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి మెదక్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కి కృషి చేస్తానని స్పష్టం చేశారు.