భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రత్యేకమైన వ్యక్తి భగత్ సింగ్. తన అసమాన పోరాటంతో ప్రజల మనస్సులో చిరస్ధాయిగా నిలిచిపోయారు. అతి చిన్న వయస్సులోనే దేశం కోసం ఉరికంబం ఎక్కారు. భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్, శివ్‌రామ్ రాజ్‌గురు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేశారు.
బ్రిటిష్ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ 1929 ఏప్రిల్ 8న ఢిల్లీ సెంట్రల్ పార్లమెంట్ హాల్లో బాంబులు విసిరి కరపత్రాలు పంచి నిరసన వ్యక్తం చేసిన విప్లవ వీరులు. వీరిని బ్రిటీష్ ప్రభుత్వం అంతర్జాతీయ జైలు నిబంధనలకు విరుద్ధంగా 1931 మార్చి 23న ఉరి తీసింది. వారి త్యాగం అప్పటి యువతకే కాదు… ఇప్పటి తరానికీ ఆదర్శనీయమే.
భగత్ సింగ్ 27 సెప్టెంబర్ 1907 వ సంవత్సరంలో ఇప్పటి పాకిస్తాన్ లో ఉన్న లాయల్ జిల్లా బంగా పట్టణంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ , విద్యావతి అనే దంపతులకు జన్మించారు. చిన్న తనంలో తన గ్రామనికి దగ్గరలో ఉన్న స్కూల్ లో కొన్ని సంవత్సరాలు చదివారు. తరవాత లాహోర్ లో ఉన్న దయానంద్ ఆంగ్లో-వేద పాఠశాల లో చేరారు.
Also Read:రాజ్యాంగం ఎలా ఏర్పడిందో తెలుసా?
గాంధీ ప్రసంగాలకు ఆకర్షితుడైన భగత్ సింగ్.. సహాయ నిరాకరణఉద్యమంలో పాల్గొన్నారు. స్కూల్ లో విదేశ వస్తువులను తగలబెట్టాడు. ఉదృతిగా జరుగుతున్న సహాయనిరాకరణద్యమం చౌరీచౌరా దగ్గర హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమం ఆపి ప్రభుత్వానికి లొంగిపోయాడు..ఇది భగత్ కు నచ్చలేదు హిందూస్తాన్ రిపబ్లిక్ సోషలిష్టు అసోషియేషన్ ను స్ధాపించారు. దీనికి చంద్రశేఖర్ అజాద్ , భగత్ సింగ్ , సుఖదేవ్ థాపర్ ,శివరాం, రాజ్ గురు, జై గోపాల్ ముఖ్యసభ్యులు. భారత్ లో తొలి సోషలిష్ట్ సంస్థ ఇదే
సైమన్ కమీషన్ కు వ్యతిరేఖంగా నిరసనలు చేస్తున్న లాలాలజపతిరాయ్ ని క్రూరంగా కొట్టడంతో ఆయన మరణించారు. దీనికి భగత్ ప్రత్యక్ష సాక్షి. ఆ సంఘటనకు కారణమైన స్కాట్ ను చంపాలని పథకం వేయగా పొరబాటున సాండర్స్ అనే పోలీసును కాల్చిచంపాడు భగత్. తర్వాత లాహోర్ శాసనసభలో బాంబువేసి తర్వాత లొంగిపోయి కోర్టులో ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా తన వాదనలు వినిపిస్తానన్న భగత్ మాటలను విప్లవసభ్యులందరూ సమర్థించగా చంద్రశేఖర్ అజాద్ మాత్రం తీవ్రంగా వ్యతిరేఖిస్తూ…ఆంగ్లేయులు అంత విశాలహృదయులు కాదనీ ఆ ఆలోచన విరమించుకోమని చెప్పినా వినలేదు భగత్ సింగ్. ఆజాద్ లేని సమయంలో లాహోర్ శాసనసభలో బాంబును వేసి లొంగిపోగా భగత్ సింగ్ ,రాజ్ గురు,సుఖదేవ్ లకు ఉరిశిక్ష పడింది.25 ఏళ్ళ వయసులోనే ఉరిశిక్ష పడుతుందని తెలిసినా భగత్ చేసిన సాహసం అసామాన్యం.
Also Read:అహింసే మహాత్ముడి…ఆయుధం