రాజ్యాంగం ఎలా ఏర్పడిందో తెలుసా?

59
- Advertisement -

200 ఏళ్ల బ్రిటిష్ని రంకుశ పాలన తరువాత ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితంతో మన దేశానికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యం లభించింది. స్వాతంత్ర్యం అయితే లభించింది గాని, అప్పటికి ఇంకా బ్రిటిష్ వారి రూల్ ఆఫ్ గైడెన్స్ చట్టాలు అమలౌతున్నాయి. అయితే మనదేశానికి కూడా ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని, మనలను మనమే పాలించుకునే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని అప్పటి మహానుభావులు దృఢ సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపొందించి 1950 జనవరి 26 న సంపూర్ణ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ రాజ్యాంగం ఎలా అమలు చేశారు ? రాజ్యాంగం రాయడానికి ఎంతమంది పని చేశారు ? అసలు రాజ్యాంగం అమలు వెనుక జరిగిన అసలు కథ ఏంటి ? అనే అంశాల గురించి తెలుసుకుందాం !

జాతీయోద్యమంలో భాగంగా ఏర్పడిన విలువలను ప్రతిబింబించేలా భారత ప్రజల చిరకాల కోరిక అయిన స్వేచ్చ, సమానత్వం, హక్కులు, రాజనీతి వంటి భావాలకు ప్రదాన్యమిస్తూ.. రాజ్యంగ రూపకల్పన జరిగింది. మొత్తం 389 మంది సభ్యులతో 1946 లో రాజ్యంగ పరిషత్ ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి డా. బాబు రాజేంద్ర ప్రసాద్ అద్యక్షత వహించారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ముస్లిం లీగ్ సభ్యులు పాకిస్తాన్ కు వెళ్లిపోవడంతో రాజ్యాంగ పరిషత్ పునః వ్యవస్థికరణ జరిగింది. ఈ రాజ్యంగ పరిషత్ లో మొత్తం 22 కమిటీలు ఉండగా.. ఈ మొత్తం కమిటీలలో డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించింది.

ఈ డ్రాఫ్టింగ్ కమిటిలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా 1947 ఆగష్టు 30న జరిగిన మొదటి సమావేశంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మెన్ గా డా. బి‌ఆర్ అంబేద్కర్ ఎన్నికయ్యారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ 1948 ఫిబ్రవరి 21 న మొదటి రాజ్యాంగ ముసాయిదా ను రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడికి సమర్పించింది. ఈ ముసాయిదాపై అభ్యంతరాలను తెలపడానికి ప్రజలకు 8 నెలల సమయం ఇచ్చారు. రాజ్యాంగ పరిషత్ నిర్వహించిన 166 సమావేశాలలో 114 సార్లు ముసాయిదా రాజ్యాంగం పై చర్చలు జరిగాయి.

Also Read:KCR:రంజిత్ రెడ్డికి బుద్ది చెప్పండి

వివిధ దేశాల రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకొని ఎన్ని సవరణల తరువాత భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. చివరకు 1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగానికి ఆమోదం తెలుపగా.. 1950 జనవరి 24న చివరి రాజ్యాంగ సమావేశంలో సభ్యులందరు సంతకాలు చేయగా 1950 జనవరి 24న భారత రాజ్యాంగం అధికారికంగా పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది. ఇందులో 395 ఆర్టికల్, 8 షెడ్యూల్స్, 22 విభాగాలు ఉండడంతో.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగం అవతరించింది. మొత్తం మీద మన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టగా.. రూ.64 లక్షల రూపాయలు ఖర్చు అయింది.

- Advertisement -