సారంగదరియా @ 75

277
love story
- Advertisement -

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’.ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమ కథను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన సారంగదరియా సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సారంగదరియా పాట విడుదల కాగానే యు ట్యూబ్ లో తుఫాన్ వేగంతో వ్యూస్ వచ్చాయి. తక్కువ టైమ్ లో ఎక్కువ వ్యూస్ సాధించిన పాటగా రికార్డ్ సృష్టించింది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట ఇప్పుడు యుట్యూబ్ ని షేక చేస్తూ 75 మిలియన్ల వ్యూస్ ని సాధించి 100 మిలియన్స్ వైపు గా దూసుకుపోతోంది. ఏప్రిల్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

https://youtu.be/h9Am4CYaLng
- Advertisement -